పల్స్ పోలియోను విజయవంతం చేయండి 

Mar 1,2024 15:21 #ntr district

విజయవాడ రూరల్ మండలం వెలగలేరు పల్స్ పోలియో పోస్టర్స్ విడుదల చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : మండలంలో మార్చి 3 వతేదీ ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఎంపీడీవో అద్దంకి శ్రీ రమ్య ,పీహెచ్సీ వైద్య అధికారి A మాధురి దేవి డాక్టర్ విజయ డాక్టర్ నిరంజన్ కార్యాలయంలో శుక్రవారం పల్స్ పోలియోపై జరిగిన అవగాహన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ ఇప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించడానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు . 34పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 8884 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, ఏ కారణం చేత అయినా ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలకు 4, 5 తేదీలలో సిబ్బంది ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమంలో నాలుగు మొబైల్ వాహనాలటీమ్స్ సిద్ధంగా ఉన్నాయని ప్రత్యేకించి ఐరిస్క్ పిల్లలకు ఒక వాహనం ఏర్పాటు చేసినామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో .సి హెచ్ ఓ ఏఎన్ఎం లు ఆశలు ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగనవాడి కార్యకర్తలు మేల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

➡️