గ్రంథాలయంలో పుస్తక పఠనం

May 19,2024 21:02

విజయవాడ : చిత్త రంజన్‌ గ్రేడ్‌-2 శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో భాగంగా విద్యార్థులచే పుస్తక పఠనం, చదివిన నీతి కథలు చెప్పించారు. తదుపరి రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌ టి.సుబ్బన్న జి.కె.శిక్షణ ఇచ్చారు. రిటైర్డ్‌ లెక్చరర్‌ బి.సావిత్రి నీతి కథలు చెప్పారు. అనంతరం యోగా, ధ్యానం, డాన్స్‌, చెస్‌, మోక్ష పటం, క్యారమ్స్‌, డాన్స్‌ తదితర ఆటలు ఆడించారు. గ్రంథాలయ అథికారి పి.సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని అన్నారు. పుస్తక పఠనం తో విద్యార్థులలో మేథోశక్తి పెరుగుతుందని అన్నారు. ఏకాగ్రత వల్ల పిల్లలు వారి మనస్సు బాగా అన్వేషించడానికి, కొత్త ఆలోచనలతో ముందుకు రావడానికి సహాయ పడుతుందని, వారి మెమరీ పవర్‌ కూడా పెరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారని అన్నారు.

➡️