యధేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు

May 20,2024 20:17

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల పరిధిలోని రంగాపురం, అన్నేరావుపేట, రెడ్డిగూడెం, మద్దులపర్వ తదితర ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు, అక్రమంగా నిల్వ ఉంచిన మట్టి తరలింపు విపరీతంగా సాగుతోంది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఎన్నిసార్లు పట్టుకొని జరిమానా విధించినా ఈ అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట పడే అవకాశం కనిపించడం లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో లోపం, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఈ మట్టి దోపిడీ యధేచ్ఛగా కొనసాగుతుంది. కనుక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, మట్టి దోపిడీని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక రెడ్డిగూడెం పోలీసులు మాత్రం అక్రమ మట్టి తవ్వకాల లారీ, ట్రాక్టర్‌లను పట్టుకుని ఫైన్‌ వేసి వదిలేశారు.

➡️