అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి

Mar 5,2024 10:02 #died, #old man, #Suspicious death

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం తెనాలి రూరల్‌లోని ఐతానగర్‌ 1వ వార్డు లంకదిబ్బలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు ఫిలిప్‌ (63) గా గుర్తించారు. భవన నిర్మాణ కార్మికుడిగా ఫిలిప్‌ అందరికీ సుపరిచితుడు అని స్థానికులు తెలిపారు. ముఖంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️