కొనసాగుతున్న సమ్మర్‌ క్యాంప్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపు 4వ రోజు గురువారం స్థానిక సుందరయ్య భవన్‌లో నిర్వహించారు. ప్రతి సంవత్సరం పిల్లలకు సమ్మర్‌ క్యాంపును క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. 4వ రోజున విద్యార్థులకు ఫన్నీ మేథ్స్‌ గురించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వినోద్‌ క్లాస్‌ బోధించారు. ఈ క్యాంపులో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సమ్మర్‌ క్యాంపును ఐద్వా మండల కార్యదర్శి నెరుసుల మాలతి పర్యవేక్షించారు.

➡️