బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి

సత్తెనపల్లి రూరల్‌:  బడి బయట ఉన్న పిల్లలను అందరిని బడిలో చేర్పిం చాలని భట్లూరు గ్రామ పంచాయతి కార్యదర్శి కృష్ణ ప్రసాద్‌ తల్లిదండ్రులకు సూచించారు. సత్తెనపల్లి మండలం భట్లూరు లో దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో విద్యా చైతన్య ప్రచారోద్యమ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, పల్నాడు జిల్లాల రీజినల్‌ కోఆర్డి నేటర్‌ మల్లెల చిన్నప్ప అధ్యక్షత వహించారు. ఫణిదం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ మాటా ్లడుతూ ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవడం వలన సమా జంలో గౌరవంగా జీవిస్తారని అన్నారు. చదువుకోవడం వలన పరిశుభ్రత, ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి ప్రభుత్వం వస్తున్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

➡️