గుర్తు తెలియని వాహనం ఢీకొని నెమలి మృతి

Jun 17,2024 11:42 #accident, #dies, #Peacock

ప్రజాశక్తి – అనంతపురం క్రైం : గుర్తు తెలియని వాహనం ఢీకొని నెమలి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని నేషనల్‌ పార్క్‌ హైవే రోడ్డుపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీ టౌన్‌ ఎస్‌ఐ గోపాలుడు తెలిపిన వివరాల మేరకు.. ఆహారం కోసం నేషనల్‌ పార్క్‌ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నడంతో ఓ నెమలి మృత్యువాత పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నెమలి మృతదేహాన్ని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌కు అప్పగించారు.

 

➡️