ప్రయివేట్‌ ఆస్పత్రులకు అనుమతి తప్పనిసరి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ప్రయివేటు ఆస్పత్రుల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం డిపిఎంఒ డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, డిఎన్‌ఎంఒ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డిలతో కలసి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆస్పత్రిని తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఎపిఎపిఎం సిఇ చట్టం 2002 ప్రకారం ప్రోటోకాల్‌కు సంబంధించిన అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు ఆస్పత్రులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని తెలిపారు. పార్కింగ్‌ ప్రదేశం, రోగులు వేచియుండు గది, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, బయో వేస్టేజ్‌ నిర్వహణ, ఫైర్‌ ఎన్‌ఒసి, బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌, వైద్యుల, పారామేడికల్‌ సిబ్బంది వివరాలు వారి సరిఫికెట్లు ,మంచినీటి సౌకర్యం, ప్రమాదాల నిర్వహణ, శానిటేషన్‌, ఆస్పత్రిలో ఉన్న వార్డులు, పడకలు, ల్యాబ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ నిర్వహణ, జెనరేటర్‌ ఏర్పాటును పరిశీలించారు. ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో ప్రయివేటు ఆస్పత్రులు నిర్ధేశించిన ప్రమాణాలు పాటించాలని లేని ఎడల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిం చారు.ఆరోగ్య వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలిఆరోగ్య కార్యక్రమాల వివరాలను ఆన్‌లైన్‌లో తప్పకుండ నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య అన్నారు. మంగళవారం డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో జిల్లాలోని 48 పిహెచ్‌సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల హెచ్‌ఐఎంఎస్‌, ఎంఎస్‌ నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ పిహెచ్‌సిలో వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలోని కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లాకు రోజువారీ, వారపు, పక్షపు, నెలవారీ నివేదికలు పంపడంలో, ఆన్‌లైన్‌ చేయడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. ప్రతి పిహెచ్‌సి నోడల్‌అధికారి వారి పిహెచ్‌సి రిపోర్టులు పెండింగ్‌ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. పిడిఎంఒ డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ మాట్లాడుతూ హెచ్‌ ఎంఐ, ఎస్‌ పోర్టల్‌, ఆర్‌సిహెచ్‌ పోర్టల్‌, ఇఎంవివివై అమలులో ఉన్న అన్ని పోర్టల్స్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. .ప్రతీ ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ ప్రొఫెషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఐడిలు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం వాతావరణము లో ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ, వడ గాలులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వీటికి గురికాకుండా ప్రజలు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు నిర్ధేశించిన చోట నిల్వలు ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో డిఐఒ డాక్టర్‌ ఉషశ్రీ, ఎస్‌ఒ ఓబుల్‌రెడ్డి, డిపిఒ మునీశ్వర్‌ పాల్గొన్నారు.

➡️