పోలీసుల తనిఖీలు

May 20,2024 23:26

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. సత్తెనపల్లి పట్టణంలోని సుగాలీ కాలనీలో పోలీసులు ఆకస్మికంగా సోమవారం కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. డీఎస్పీ జి.గురునాథ్‌బాబు ఆదేశాల మేరకు పట్టణ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ధ్రువపత్రాల్లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణ ఎస్‌ఐలు సత్యనారాయణ, సంధ్యారాణి ఎఎస్‌ఐ సుబ్బారావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాశక్తి – పెదకూరపాడు : మండలంలోని బలుసుపాడులో పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలింగ్‌ తేదీన ఆ గ్రామంలో గొడవలు జరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు చేపట్టినట్లు పెదకూరపాడు ఎస్సై విప్పర్ల వెంకట్రావు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు.

➡️