చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం-చంద్రగిరి (తిరుపతి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో చంద్రగిరి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అలర్ట్‌ అయ్యారు. సిట్‌ బఅందం చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి గ్రామాలలో పర్యటించి విచారణ చేపట్టింది. సిట్‌ బఅందం పర్యటన అనంతరం చంద్రగిరిలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి మంగళవారం కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. చంద్రగిరిలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి హింసాత్మక దాడులకు తావు లేకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముగ్గురు సిఐలు, నలుగురు ఎస్‌ఐలు 70 మంది కానిస్టేబుళ్లు బఅందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో నిమగమయ్యి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ ఎం.రామయ్య హెచ్చరించారు.

➡️