చిరుధాన్యాలతో బుద్ధుని చిత్రపటం

చిరుధాన్యాలతో బుద్ధుని చిత్రపటం

ఆవిష్కరించిన బౌద్ధ భిక్షవులు

చిత్రకారుడు విజరుకుమార్‌కు సత్కారం

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజరుకుమార్‌ మిల్లెట్స్‌తో ప్రత్యేకంగా నాలుగు అడుగులు ఎత్తు, మూడు అడుగుల వెడల్పుతో రూపొందించిన బుద్ధుని చిత్రపటాన్ని బుధవారం ఎంవిపి కాలనీలోని ఎయు అంతర్జాతీయ విద్యార్థినుల వసతిగృహంలో బౌద్ధ భిక్షువుల సమక్షంలో ఆవిష్కరించారు.చిత్రకారుడు తీర్చిదిద్దారు. ఈ చిత్రపటాన్ని కేవలం మిల్లెట్స్‌ ఉపయోగించి 20 రోజులు శ్రమించి తయారు చేశారు. మేకా విజయకుమార్‌ 20రోజులు శ్రమించి దీన్ని తయారుచేశారు. అనంతరం బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మిల్లెట్స్‌ ఉపయోగించి ఎంతో కళాత్మకంగా సహజత్వం తొణికిసలాడేలా బుద్ధుని చిత్రపటాన్ని తీర్చిదిద్దిన చిత్రకారుడు మోకా విజరుకుమార్‌ను సత్కరించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ ఆచార్య ఈశ్వర్‌కుమార్‌, మహిళా హాస్టల్‌ వార్డెన్‌ డాక్టర్‌ కె.రాజమాణిక్యం పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని చిత్రపటాన్ని తమతో ఆవిష్కరింపజేయడంపై బౌద్ధ భిక్షువులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

బుద్ధుని చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న బౌద్ధభిక్షవులు

➡️