నులు పురుగుల నిర్మూలనా దినోత్సవం పోస్టర్‌ రిలీజ్‌

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈనెల 9వ తేదీన నులు పురుగులు నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ ను బుధవారం ఉదయం డిఎం హెచ్‌ ఓ కార్యాలయంలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్‌.భాస్కరరావు, అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కె.రాణి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భాస్కరరావు మాట్లాడుతూ …. ఈనెల 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా నులిపురుగులు దినోత్సవం సందర్భంగా, 01 నుంచి 19 సంవత్సరాలలో పిల్లలందరిని తప్పనిసరిగా ఆల్‌ బెడ్‌ జోల్‌ (నులు పురుగులు నివారణ) 400ఎంజి ట్యాబ్‌లెట్‌ ఇవ్వబడతాయన్నారు. 1 నుంచి 2 సంవత్సరాలు పిల్లలకు 1/2 ముక్క టాబ్లెట్‌ను పొడి చేసి నీళ్ళలో కలిపి తాగించాలన్నారు. 3 నుంచి 19 సంవత్సరాల వారికి ఒక మాత్ర పూర్తిగా వేయించాలన్నారు. ఈ పూర్తి బాధ్యత అంగన్వాడీ, ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్‌, జూనియర్‌ కాలేజీ లలో ఆయా సైన్స్‌, క్లాస్‌ టీచర్స్‌ దేనన్నారు. 1 నుంచి 19 సంవత్సరాలు వారు జిల్లా వ్యాప్తంగా 3,58,067మంది ఉన్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా 3,94,000 టాబ్‌లెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఈరోజు అవన్నీ అన్ని మండలాలకు చేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిపో ఆర్‌.అచ్చుత కుమారి, జిల్లా విస్తీర్ణం మీడియా ఆఫీసర్‌ వి.చిన్న తల్లి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️