కోవూరు స్టేట్ బ్యాంకు ముందు సీపీఎం నిరసన

Mar 11,2024 14:19 #Nellore District
CPM protest in front of Kovuru State Bank

ప్రజాశక్తి-కోవూరు : రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పిలుపు మేరకు సోమవారం కోవూరులోని రైల్వే రోడ్ లోని స్టేట్ బాంక్ ముందు నిరసన తెలిపారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గన్నవరపు శేషయ్య మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఎన్నికల్లో వివిధ సంస్థల నుండి తీసుకున్న ఎలెక్ట్రో బాండ్లు నెల రోజుల లోపల సుప్రీంకోర్టుకు సమాచారం సమర్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు బిజెపి స్టేట్ బ్యాంకు వద్ద సమాచారం తీసుకోలేదని దేశంలోని వివిధ బ్రాంచ్ మేనేజర్ల నుండి ఎంత మొత్తం ఎన్నికల ఎలక్ట్రో బాండ్లు కొనుగోలు చేసింది వివరించాలని కోరారు. అంతరం కోవూరులోని రైల్వే రోడ్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్ కి అర్జీ ఇవ్వడం జరిగింది. పై కార్యక్రమంలో బుజ్జయ్య, చాంద్ బాషా, అప్రోజ్, మోహన్, రమేష్, కాలేషా, తిరుపతి, ఉమాయన్, తదితరులు పాల్గొన్నారు.

➡️