నెల్లూరులో భారీ ప్రదర్శన

Feb 16,2024 13:03 #Nellore District

ప్రజాశక్తి-నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్మిక, కర్షక, రైతు, రవాణా సంఘాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి భారీ ప్రదర్శనగా గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి నగర, రూరల్ నియోజకవర్గాలు చెందిన కార్మిక కర్షక రైతు వ్యవసాయ రవాణా, భవన నిర్మాణ సంఘాల కార్మికులు, నాయకులు భారీ ప్రదర్శనగా విఆర్సి సెంటర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం సభా కార్యక్రమం నిర్వహించారు. సభా కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు పి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విటమి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండ కట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️