పొగాకు రైతులకు అండగా ఉంటాం..

Jun 20,2024 19:49
పొగాకు రైతులకు అండగా ఉంటాం..

పొగాకు వేలం కేంద్రరాన్ని పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు
పొగాకు రైతులకు అండగా ఉంటాం..
ప్రజాశక్తి-కందుకూరు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తోటి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దష్టికి తీసుకెళ్తానని ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పామూరు రోడ్డులోని 27వ నెంబర్‌ పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను గురువారం ఆయన పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం వేలంకేంద్రం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో అధికారులు, కంపెనీ ప్రతినిధులు, రైతు ప్రతినిధులతో ఎంఎల్‌ఎ చర్చించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కౌలు, కూలీల రేట్లు, ఇతర ఖర్చులు పెరిగిపోయాయని, అందుకు తగ్గట్లుగా కంపెనీ ప్రతినిధులు కూడా సానుకూలంగా వ్యవహరించి గిట్టుబాటు ధర లభించేలా రైతులకు సహకరించాలని కోరారు. అనుమతికి మించి పండించిన కొనుగోళ్లు విషయంలో కర్ణాటకలో అపరాధ రుసుము ఉండదని, మన రాష్ట్రంలో కూడా అలాగే రైతులకు మేలు జరిగేలా బోర్డు ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని నాగేశ్వరావు తెలిపాఉ. వేలంకేంద్రం సూపరింటెండెంట్‌ కే.రాజగోపాల్‌ ఆధ్వర్యంలో రైతులు, రైతు ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును సత్కరించారు.

➡️