ప్రభుత్వ బడిని రక్షించుకుందాం.. : యుటిఎఫ్‌

Jun 26,2024 22:00
ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు
ప్రభుత్వ బడిని రక్షించుకుందాం.. : యుటిఎఫ్‌
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ బడిని రక్షించుకుందాం.. పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిద్దాం.. అనే కార్యక్రమం కరపత్రాలను యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ పి.చంద్రశేఖర్‌ రెడ్డి ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని బిజ్జంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. యుటిఎఫ్‌ మండల శాఖ ప్రధాన కార్యదర్శి మీనిగా ఫణిరాజు, జిల్లా కౌన్సిలర్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బడి అంటే చుట్టూ ఉన్న సమాజం అని, అమ్మ ప్రేమ నాన్న భరోసా కలగలసిన ఆటపాటల చదువుల ఒడి ప్రభుత్వ బడి అని తెలిపారు. ప్రభుత్వ బడిలో నైతిక విలువలు, చదువు, సంస్కారం, దేశభక్తి, సమానత్వ భావనలు ఏర్పడేలా విద్యాబుద్ధులు నేర్పించబడతాయని అటువంటి బడిని ఉపాధ్యాయులు కాపాడుకొని సమాజాభివృద్ధికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడం, ప్రభుత్వ బడిలోని సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేసి వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ఊరి బడిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలోనే కాక ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలోనూ, సామాజిక సేవా దృక్పథం లోనూ, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ప్రతి ఉపాధ్యాయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు దుర్గా ప్రసాద్‌, రామకృష్ణ, పద్మనాభరెడ్డి, చెన్నకృష్ణయ్య, ఖాదర్‌ భాషా, రవి, సారథి పాల్గొన్నారు.

➡️