చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మోద్దు ప్రజాశక్తి

-బి.కొత్తకోట టిడిపి అధ్యక్షులు చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మవద్దని త్వరలో జరగబోవు ఎన్నికల్లో వైసిపి సత్తా ఏమిటో చూపించాలని జెసిఎస్‌ కన్వీనర్లకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డిలు దిశానిర్దేశం చేశారు. సోమవారం పెద్దతిప్పసముద్రం కింగ్‌ ఫంక్షన్‌హాల్లో పిటియం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల జెసిఎన్‌ కన్వీనర్ల సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఈ సమావేశానికి వైసిపి రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాల్లో ఎన్నికలు జరుగుతు న్నాయని, గత ఎన్నికల సమావేశంలో రోడ్లు బాగు చేస్తా మని మాట ఇచ్చి ఆ మాట మేరకు వందలాది రోడ్లు తంబళ్లపల్లె నియోజకవర్గంలో వేశామన్నారు. ఇంకా అనేక రోడ్లు టెండర్లు అయిపోయి పనులు జరుగు తున్నాయని,రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివద్ది చేసి చూపిస్తామన్నారు.హంద్రీ-నీవా పూర్తి చేసి మన ప్రాంతానికి నీరు అందిస్తామని తెలిపా మని,ఇప్పటికే అందుకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మన ప్రాంతంలో పరిశ్రమలు పెద్దఎత్తున తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని మీ ఆశీర్వాదం కావాలని కోరారు. ప్రతిపక్షాలు అందరూ కలిసి సిఎం జగన్‌పై యుద్ధం చేస్తున్నారని, వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటేనే మనకు పథకాలు అందుతాయని, ఆయనకు మరోసారి మనమంతా అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక బోరు అయినా వేశాడా, కరోనా సమయంలో సొంత ఊరిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు.పదేళ్లు హైదారాబాదులో ఉండి, ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చాడని అలాంటి వ్యక్తికి ప్రజలందరూ ఓటు ద్వారా బుద్ది చెప్పాలని కోరారు.

➡️