సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చా

May 7,2024 15:21 #gowd

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్
దర్శి : నిజంగా, నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలనే సదాశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్‌ అన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు, కొండేపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తన ప్రచారానికి ప్రజానీకం నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. సీరియల్‌ నం.20లో ఉన్న కుండ గుర్తుకు ఓట్లేసి తనను అత్యధిమ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో దశాబ్ధాలపాటు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ‘నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను పూర్తిచేయిస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నీటిని గిద్దలూరుకు తరలించేందుకు కృషిచేస్తానన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా తన వంతుగా కృషిచేస్తానన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో కుండ గుర్తుపై ఓట్లేసి తనను గెలిపించాలని జె.వి.మోహన్‌గౌడ్‌ కోరారు.

➡️