బస్టాండ్ లో పలు అభివృద్ధి పనులు

Mar 13,2024 11:49 #Prakasam District

ప్రజాశక్తి-శిoగరాయకొండ : శిoగరాయకొండలోని ఆర్టీసీ బస్టాండ్ లో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. దాదాపు 80 లక్షలతో చేసిన మరుగుదొడ్లు ఆధునీకరణ, 4 కొత్త ప్లాట్ ఫారంల నిర్మాణం పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, జోనల్ చైర్మన్ సుప్రజరెడ్డి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

➡️