ఉత్సాహంగా పొట్టేళ్ల పందేలు

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం. పాత శింగరాయకొండ శ్రీవరహాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకష్ణయాదవ్‌ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పొట్టేళ్ల పందేలు బుధవారం నిర్వహించారు. ఈ పోటీలకు ఐదు జతలు పొట్టేలు వచ్చాయి. పోటీలను టిడిపి మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, మండల కార్యదర్శి చీమకుర్తి కష్ణ, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, ఉప సర్పంచి నక్కా బ్రహ్మేశ్వరరావు, దేవస్థానం చైర్మన్‌ పామర్తి మాధవరావు, జిఎస్‌కె గ్రూప్స్‌ అధినేత గంజి ప్రసాద్‌ పోటీలను ప్రారంభించారు. బాపట్ల, శింగరాయకొండ, పర్చూరు, మార్టూరు నుంచి వచ్చిన పొట్టేలు పోటీలో హోరాహౌరీగా తలపడ్డాయి. బాపట్ల జిల్లా మద్దెన బోయినవారిపాలెంకు చెందిన మద్దినపోయిన రాము పొట్టేలు మొదటి బహుమతిని సాధించింది. విజేతకు టిడిపి నాయకులు నర్రా రాంబాబు రూ. 25 వేల నగదు అందజేశారు. పాత శింగరాయకొండ ఉప సర్పంచ్‌ నక్క బ్రహ్మేశ్వరరావుకు చెందిన పొట్టేలు ద్వితీయ బహుమతిని సాధించింది. విజేతకు వావిలేటిపాడు చెందిన పటాపంజుల కొండలు రూ. 20 వేల నగదు అందజేశారు. పర్చూరు చెందిన ఉప్పుటూరి శ్రీకష్ణ యాదవ్‌ పొట్టేలు తృతీయ స్థానంలో నిలిచింది. విజేతకు దాత కొనికి అమర్‌నాథ్‌ రూ.15 వేల నగదు అంజదేశారు. మార్టూరు గంగమ్మ తల్లి పొట్టేలు 4వ బహుమతిని సాధించింది. విజేతకు మించల బ్రహ్మయ్య రూ.12 వేల నగదు అందజేశారు. శింగరాయకొండ మండలం శానంపూడి పంచాయతీ పరిధిలోని పటికనేనివారిపాలెంకు చెందిన పసుపులేటి మహేష్‌యాదవ్‌ పొట్టేలు ఐదో బహుమతిని సాధించింది. విజేతకు రూ.10 వేల నగదు నిర్వాహకులు అందజేశారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున విచ్చేసి పొట్టేళ్ల పందేలను ఆసక్తిగా తిలకించారు.

➡️