మద్ధుల డింపుల్ కు ఐఐటి – ఢిల్లీ లో సీటు.. పలువురు అభినందనలు

Jun 20,2024 15:22 #IIIT, #prakasam

పామూరు : శ్రీ ఆదిత్య జూనియర్ కాలేజీ, పామూరు, బెల్లంకొండ కాలేజీ, CS పురం. సెక్రటరీ & కరెస్పాండంట్ శ్రీ మద్దుల శ్రీనివాసులు కూతురు మద్ధుల డింపుల్ 2024 – JEE Advace 68 వ ర్యాంక్ తో IIT – ఢిల్లీ లో కంప్యూటర్ విభాగంలో సీటు సాధించినది. ఈ సందర్బంగా మద్ధుల డింపుల్ ను, ఆమె తల్లిదండ్రులు మద్దుల శ్రీనివాసులు – లక్ష్మీ కుమారీ, డింపుల్ మేనత్త మామయ్యలు (BITS – బెల్లంకొండ కాలేజీ అధినేతలు), శ్రీమతి బెల్లంకొండ విజలక్ష్మీ శ్రీనివాస్ లను మార్కాపురం కనిగిరి ఎమ్మెల్యే డా. ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అభినందనలు తెలిపారు. అలాగే  ఇంటర్ మీడియట్  ఆర్ఐఓ సైమన్ విక్టర్, ఆదిత్య, బెల్లంకొండ విద్యాసంస్థలు ప్రిన్సిపాల్స్ ఆర్.నాగరాజు, షేక్  షరీఫ్, ఎన్ . వెంకటేష్ అధ్యాపాకులు, సిబ్బంది,  బిట్స్ (BITS ) – ఫార్మసీ కాలేజీ పొదిలి ప్రిన్సిపాల్ డా: నారపుశెట్టి నాయుడు, ప్రొఫెసర్ డా: నారపుశెట్టి ఝాన్సీ ప్రియానాయుడు, అధ్యాపాకులు – సిబ్బంది, పొదిలి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్  సోమరౌతు ధర్మారావు, విద్యావేత్తలు బూసిరాజు నాగప్రసాద్,  కొంకాల రామ్మోహన్ రావు, న్యాయవాది భాష, డా.ఇమాంస తదితరులు డింపుల్ కి  శుభాభినందనలు తెలియజేశారు.

➡️