గుంతలతో ప్రమాద భరితంగా మారిన రహదారి..

Dec 21,2023 10:39 #Prakasam District
road problem in kambham

పట్టించుకోని అధికారులు..
ప్రజాశక్తి-కంభం రూరల్ : కందుల పురం పంచాయతీలోని కందులాపురం సెంటర్ నుండి కందుల పురం గ్రామంలోకి వెళ్లే రహదారిలో మురికి కాలువల ఏర్పాటు లేనందువలన రోడ్లపై వర్షపు నీరు గృహాల నుండి వచ్చే మురికి నీరు రోడ్డుపై నిలిచిపోయి పలుచోట్ల రోడ్లపై ఏర్పడుతున్నాయి. అలాగే గురుకుల పాఠశాల నుండి గ్రామంలోకి వెళ్లే రహదారిలో సైతం అడుగు కో గుంత.. గజానికి గోయి ఉంది. ఈ గుంతల మీరుగా రాకపోకలు సాగించే సమయంలో వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారి మీదుగా పలు విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించండి గుంతలు పూడ్చేందుకు మరియు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️