సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం

ప్రజాశక్తి -కనిగిరి : మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రచ్చబండ, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టిడిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, వైసీపీ సీనియర్‌ నాయకుడు పోతు కొండారెడ్డి డాక్టర్‌ ఉగ్రకు మద్దతు తెలిపి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ వైసిపి అరాచక పాలన పట్ల విసుకు చెందిన ప్రజలు, వైసిపి నాయకులు టిడిపి ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలో రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టిడిపిలో చేరారు. డాక్టర్‌ ఉగ్ర వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసరెడ్డి, కేటీఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ కుందురు తిరుపతిరెడ్డి, నాయకులు నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్‌ బారాయి మామ్‌ తదితరులు పాల్గొన్నారు.సిఎస్‌ పురం: సిఎస్‌పురం మండలం బోయమడుగుల పంచాయతీలోని తుంగొడు, పిల్లిపల్లి, బోయమడుగుల, బాలపల్లి, వెంకటాయచెరువు గ్రామాల్లో టిడిపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బి.వెంగయ్య, నాయకులు నాగిశెట్టి చిన్నమాలకొండయ్య, రామకష్ణంరాజు, కోనంకి వెంకటకొండయ్య, బత్తుల వెంకటాద్రి, పావలి తిరుపతయ్య, కామనబోయిన వెంకటస్వామి, దాసరి మల్లికార్జున, అల్లూరయ్య, వెంకటేశ్వర్లు, చిన్నకొండు తిరుమలయ్య, పాశం వెంకటేశ్వర్లు, గంగిపోగు జోసెఫ్‌, గాయపు రమేష్‌, ఆవుల నారు, తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️