‘ఉత్తరం’లో వైసిపి ఆత్మీయ సమావేశాలు, ప్రచారం

May 10,2024 00:15 #KK Raju Pracharam
KK Raju Pracharam

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 23వ వార్డు పరిధి ప్రియదర్శిని కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఉత్తర నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు ఆత్మీయసమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేశారు. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్‌ సాడి పద్మారెడ్డి, బాక్సర్‌ రాజు, మొల్లి అప్పారావు, జివి రమణి పాల్గొన్నారు. 49వ వార్డు పరిధి వైభవ్‌ పార్కులో ఎన్జీజీవోస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులతో కెకె.రాజు సమావేశం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లు శంకరరావు, ఎన్జీజీవోస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పార్వతీశ్వరరావు, పి బలరాం స్వామి, కె.రామచంద్ర రాజు, కృష్ణమోహన్‌, ఆర్‌.శ్రీనివాసరావు, సాంబశివరావు, రాజారావు, పి.శ్రీనివాసరావు, కాలనీ పెద్దలు పి.బంగార్రాజు, చంద్రమౌళి, బాల చెన్నయ్య పాల్గొన్నారు. జివిఎంసి 55వ వార్డు కార్పొరేటర్‌ కెవిఎన్‌ శశికళ ఆధ్వర్యాన ధర్మానగర్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కెకె.రాజు మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్లలో అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

➡️