సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … వైసిపి శ్రేణుల నిరసన

Apr 14,2024 11:29 #ap cm jagan, #attack, #Protests, #YCP

ఏలూరు : సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … చింతలపూడి మండలం పాతిమపురం క్రాస్‌ రోడ్డులో మండల అధ్యక్షులు జానకిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు ఆదివారం నిరసన చేపట్టారు. జగన్‌ మోహన్‌ రెడ్డి కి వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష్య ద్వేషాలతో చంద్రబాబు రగిలిపోతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే బాగా చేయగలమని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని, కరోనా టైంలో అద్దాల మేడలో దాక్కున్న చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ ఎలా తెచ్చుకోవాలో తెలియటం లేదని మండిపడ్డారు. జగన్‌ పై దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి తాటాకు చప్పుడ్లకు జగన్‌ బెదరడు అని అన్నారు. ఈ ధర్నాలో జడ్‌పిటిసి నీరజ, ప్రగడవరం సర్పంచ్‌ భూపతి, వైసిపి నాయకులు రఘునాద్‌ రెడ్డి, వైసిపి అభిమానులు పాల్గొన్నారు.

➡️