నిత్యావసరాలు అందజేత

కొండపి : మండల పరిధిలోని ముక్కోడిపాలెం గ్రామానికి చెందిన కడియం వసంతరావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. ఇంటి యజమాని మృతిచెందడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రెండ్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు, కొండపి స్టేట్‌ బ్యాంకు మేనేజర్‌ తెల్లపాలు శరత్‌ చేతుల మీదుగా మృతుడి భార్య సుజాతకు కుట్టు మిషన్‌ ,రెండునెలల సరిపడ నిత్యావసర సరకులు, రెండు బస్తాల బియ్యం, రూ.5 వేల నగదు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

➡️