వాలంటీర్ వ్యవస్థతో ప్రజారంజక పాలన : మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

Feb 20,2024 16:50 #anathapuram, #volunteers

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : వాలంటీర్ వ్యవస్థతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగిస్తున్నారని,ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ,వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఇంటింటికీ వెళ్లిందని వివక్ష లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాయని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. వజ్రకరూరు మండల కేంద్రంలోని మండల కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం వరసగా నాలుగో ఏడాది నిర్వహించిన వాలంటీర్లకు అభినందన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని,వరుసగా నాలుగో ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం సేవా వజ్ర అవార్డు పొందిన చిన్న హోతురు బాల్యం లావణ్య,సేవారత్నకు ఎంపికైన సాకే రాధ,దాదా ఖలందర్,నిఖిత,చిన్న ఓబులేసు,లలిత,సేవా మిత్ర వలంటీర్లకు శాలువా,మెడల్ తో పాటు ప్రశంసాపత్రం అందించి మాజీ ఎమ్మెల్యే సన్మానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న,వజ్రకరూరు ఎంపిపి దేవి బాయి,సర్పంచ్ మొనలిసా, వైస్ ఎంపిపిలు సుశీల రాణి,సుంకమ్మ,మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ,మండల కన్వీనర్ సోమశేకర్ రెడ్డి,ఎంపీడీవో విజయ లలిత,తాసిల్దార్ మహమ్మద్ రఫీక్,సీఐ ప్రవీణ్ కుమార్,రాష్ట్ర నాయకులు ప్రసాద్ రెడ్డి,వెంకట రెడ్డి, జేసిఎస్ కన్వీనర్ ఉస్మాన్, పిఏసీఎస్ చైర్మన్ సుధీర్ రెడ్డి, ఎంఎల్ ఓ తేజేశ్వర్ రెడ్డి,గ్రామ కార్యదర్శి శ్రీధర్ రావు, నాయకులు ప్యాపిలి భీమా, కిష్ట,సామా నాయక్, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️