రేపు తాడేపల్లిలో బహిరంగ సభ

May 7,2024 00:48

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-మంగళగిరి :
ఇండియా వేదిక తరపున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు ఎంసీ స్థానం సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ విజయాలను కాంక్షిస్తూ తాడేపల్లిలో బుధవారం జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. సభ సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లి పట్టణం కృష్ణుడి గుడి సెంటర్లో ఉంటుందని, సభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రసంగిస్తారని తెలిపారు. గత పది సంవత్సరాల బిజెపి పాలనలో దేశవ్యాప్తంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి అని అన్నారు. బిజెపి పాలన భారత రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలకు విగాదం కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి పార్టీలో రాష్ట్రంలో విమర్శించుకుంటున్నారు గానీ, కేంద్రానికి వచ్చేసరికి బిజెపికి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను, కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపిలను, జనసేన, బిజెపి పార్టీలను ఓడించాలని అన్నారు. బహిరంగ సభకు సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ మతోన్మాద బిజెపి పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ సలీం మాట్లాడుతూ ఇండియా బ్లాక్‌ వేదిక ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిందని అన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి రూ.లక్ష చొప్పున అందిస్తారని తెలిపారు. వద్ధాప్య పెన్షన్‌ పెచుతున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు కె.జీవన్‌ సాగర్‌ మాట్లాడుతూ దళితులు, మైనార్టీలు, మహిళలు అండగా ఉండాలంటే ఇండియా బ్లాక్‌ వేదిక అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు వై.వెంకటేశ్వరరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఇ.అప్పారావు, సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, కాంగ్రెస్‌ నాయకులు ఆర్‌.హను మంతరావు, కె.రాధిక పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

➡️