ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ టీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్ ను నియమించినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి, ఎసిసి ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరారెడ్డి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు, పల్లం రాజు, మీడియా చైర్మన్ తులసి రెడ్డి, రాయలసీమ జోనల్ ఇన్చార్జి జంగా గౌతమ్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తన మీద విశ్వాసంతో తనకు ఈ పదవి ఇవ్వడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం క్రియాశీలకంగా పనిచేసే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు.

➡️