పింఛన్లు కోసం క్యూ

Apr 4,2024 21:34

ప్రజాశక్తి- బొబ్బిలి : పింఛన్లు కోసం సచివాలయాలు వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు క్యూ కడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. వికలాంగులకు, నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నికల కమిషన్‌ ఆదేశించినప్పటికి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయకుండా సచివాలయాలు వద్ద పంపిణీ చేస్తున్నారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు బంధువులు సహాయంతో పింఛన్లు కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం స్పందించి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వృద్ధులు, వికలాంగులు కోరుతున్నారు.వేపాడ: మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుంది. రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ సిబ్బంది త్వరితగతిన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం నాటికి డిఆర్‌పేటలో 96శాతం, సోంపురం 95, వేపాడ 94, సింగరాయి 81, కుంపల్లి 84, బానాది, జాకెరులలో 85, వావిలిపాడులో 90శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు. కొత్తవలస: మండలంలో పింఛన్లు కోసం గ్రామ సచివాలయాలు వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు క్యూ కడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలలో ఉన్నందున వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. వికలాంగులకు, నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నికల కమిషన్‌ అదేశించినప్పటికి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయకుండా సచివాలయాలు వద్ద పంపిణీ చేస్తున్నారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు బంధువులు సహాయంతో పింఛన్లు కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వృద్ధులు, వికలాంగులు కోరుతున్నారు.పింఛన్ల పంపిణీ తనిఖీ చేసిన ఎంపిడిఒతెర్లాం: మండలంలోని కునాయవలస సచివాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఎంపిడిఒ మధుసూదన్‌రావు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులూ కలగకూడద న్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంచినీటి సదుపాయం, టెంట్లు, ప్రథమ చికిత్సకు సంబంధించిన మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

➡️