రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రైల్వేకోడూరురైల్వేకోడూరు జనసేన టికెట్‌ను అరవ శ్రీధర్‌ దక్కించుకున్నారు. ఇటీవల జనసేన అధ్య క్షులు పవన్‌కల్యాణ్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైల్వేకోడూరుకు యన మల భాస్కర్‌రావు పేరును ప్రకటించారు. అప్పట్లో ఎవరికీ తెలియని వ్యక్తికి టికెట్‌ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేనలో అంతర్మధనం నెలకొంది. ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఓబులవారిపల్లె మండ లంలోని ముక్కావారిపల్లి సర్పంచ్‌ అరవ శ్రీధర్‌ టికెట్‌ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం దక్కడం చర్చనీయాంశంగా మారింది. జనసేన రైల్వేకోడూరు అభ్యర్థిత్వం మార్పుపై సీరియస్‌గా దృష్టి సారించింది. టిడిపి అభ్యర్థికి ఆర్థిక, అంగ, అనుచర బలం కలిగిన ముక్కావారిపల్లికి చెందిన టిడిపి రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి ముక్కా రూపా నందరెడ్డి పావులు కదిపినట్లు తెలుస్తోంది. వైసిపి తరుపున ఐదవ విడత ఎన్నికల బరిలో నిలిచిన కొరముట్ల శ్రీనివాసులుకు ధీటైన అభ్యర్థిగా కూటమి తరుపున స్థానికుడు, అందరికీ పరిచయం కలిగిన అభ్యర్థి అరవ శ్రీధర్‌ను నిలబెట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

➡️