కరపలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష

Dec 23,2023 15:16 #Kakinada

ప్రజాశక్తి – కరప(కాకినాడ): సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా12 వ రోజు  శనివారం అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష తో నిరసన వ్యక్తం చేశారు.  స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా రిలే నిరాహార దీక్షను సిఐటియు మండల కార్యదర్శి బి రాంప్రసాద్ ప్రారంభించారు. అంగన్వాడి ప్రాజెక్టు నాయకురాలు పి వీరవేణి మాట్లాడుతూ. ఎస్.వరలక్ష్మి, ఎస్ ఎస్ కుమారి, దైవ కుమారి ,అచ్చారత్నం ,కల్పలత, హెల్పర్ సత్యా మాధవి.ఎం భవాని, నారాయణమ్మ, జ్యోతి,కల్పలత, పి లక్ష్మి, ఏ దేవి, బి మనోజ, లక్ష్మి,సాయి దుర్గ, బి భవాని,తదితర  అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️