కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆర్‌ఒ సమావేశం

సత్తెనపల్లి రూరల్‌: కౌంటింగ్‌ ఎంజెట్లతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి మురళీ కృష్ణ  బుధవారం సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు,కౌంటింగ్‌ ఏర్పాట్లు గురించి తెలియజేశారు. నరసరావుపేట జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి ఏజెంట్‌ లు ప్రతినిధులు ఎవరైనా క 24 గంటలు, కౌంటింగ్‌ రోజు వరకు లైవ్‌ పుట్‌ ఏజ్‌ ను చూసుకోనుటకు అనుమతి ఇచ్చామని చెప్పారు.త.పోస్టల్‌ బ్యాలెట్‌ ,హౌమ్‌ ఓటింగ్‌ బాక్స్‌ లను కౌంటింగ్‌ కు ముందు రోజు జూన్‌ 3వతేదీన సాయంత్రం 4.00గంటలకు కౌంటింగ్‌ సెంటర్‌ కు తరలిస్తామని వివరించారు, కౌంటింగ్‌ రోజు ఉద యం.7.59 గంటల వరకు వచ్చిన సర్వీస్‌ ఓట్లు , పోస్టల్‌ బ్యాలెట్లను మాత్రమే కౌంటింగ్‌ లో పరిగణన లోనికి తీసు కుంటామని చెప్పారు. ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్‌ అధికారులు. సిహెచ్‌ ఉష, ఎల్‌. లక్ష్మీ నారా యణ, పి. లక్ష్మీనరసింహం, కె.షమ్మి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️