ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ

Mar 7,2024 12:19 #Tirupati district
road accident in tirupati

ప్రజాశక్తి-చంద్రగిరి : పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం తొండవాడ హ్యాపీ డాబా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి తిరుపతి వైపుగా కాశిరాయి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ఆయనను హైవే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.

➡️