వైసిపితోనే సమన్యాయం : అన్నా

ప్ర్రజాశక్తి-కొనకనమిట్ల : వైసిపితోనే అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని వైసిపి మార్కాపురం నియోజక వర్గ అభ్యర్థి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు తెలిపారు. మండల పరిధిలోని వింజనర్తిపాడు, దేవిరెడ్డిపల్లె, నాగంపల్లి, సలనూతల, చినమనగుండం, గొట్లగట్టు గ్రామాలలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గడప గడపకూ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎపిఐఐసి చైర్మన్‌ జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సిఎం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా అనా ్నరాంబాబును, వైసిపి ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపిపి మారబోయిన మురళీకష ్ణయాదవ్‌, జడ్‌పిటిసి అక్కి దాసరి ఏడుకొండలు, మాజీ సర్పంచి ఉడుముల గురువారెడ్డి, శివాలయం మాజీ చైర్మన్‌ కంకణాల రమేష్‌, వైసిపి మండల కన్వీనర్‌ శంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచి తాతిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, పెద్దవెంకట రెడ్డి, తాతిరెడ్డి చలమారెడ్డి, మాజీ వైస్‌ ఎంపిపి పున్నం శ్రీను, సర్పంచి వెంకటమురళి, ఉపసర్పంచి గాడి కోనేటిరెడ్డి, నాయకులు ఉడుముల కాశిరెడ్డి, నాగం బాలగురవయ్య,బి.మాలకొండయ్య, మాజీ ఎంపిటిసిలు పెద్దవెంకటయ్య, గోనుగుంట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️