ఈవీఎంల పరిశీలన

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సోమవారం జరగనున్న ఎన్నికల కోసం సిబ్బందికి కేటాయించేందుకు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్ధంగా ఉంచిన ఈవీఎం మిషన్‌లను ఎన్నికల స్టేట్‌ అబ్జర్వర్‌ మయూర్‌ కె మెహతా ఆదివారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట యర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల అధికారి డాక్టర్‌ పి శ్రీలేఖ ఉన్నారు.

➡️