అంగన్‌వాడీల అరెస్టులు

Jan 3,2024 22:30

నల్లమాడ పోలీసు స్టేషన్‌లో ఉన్న సిఐటియు నాయకులు, అంగన్‌వాడీలు

            పుట్టపర్తి అర్బన్‌ : అంగన్వాడీలు కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు కొనసాగించారు. అంగన్‌వాడీ యూనియన్‌, సిఐటియు నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామునే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ను అరెస్టు చేసి నల్లమాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్‌ జిల్లా వర్కర్ల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణను పుట్టపర్తికి రాకుండా అమడగూరులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సిఐటియు పట్టణ కార్యదర్శి పైపల్లి గంగాధర్‌ను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని పుట్టపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఉంచారు. పలువురు అంగనవాడి యూనియన్‌ నాయకురాళ్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ అరెస్టులను సిఐటియు ఉపాధ్యక్షులు ఎం.ఇంతియాజ్‌, శ్రామిక మహిళా సమాఖ్య కార్యదర్శి దిల్షాద్‌బి, అంగన్వాడీల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ఖండించారు.

➡️