యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

సమావేశంలో మాట్లాడుతున్న ఎడిజె కంపల్లె శైలజ

       హిందూపురం : దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో మత్తు పదార్థాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కావడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారి లక్ష్యాలను సాధించేందుకు, సమాజాభివద్ధికి యువత కషి చేయాలన్నారు. చదువులో రాణిస్తూ సమాజాభివద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి కళాశాలల ప్రిన్సిపాల్స్‌ నారాయణరెడ్డి, శివ శంకర్‌ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజశేఖర్‌, న్యాయవాదులు సుదర్శన్‌, సంతోషికుమారి పాల్గొన్నారు.

➡️