అందరికీ అందుబాటులో ఉంటా : మంత్రి ఉషశ్రీచరణ్‌

Jan 6,2024 22:13

కౌన్సిలర్‌ జయశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రేన్‌సాయంతో మంత్రికి యాపిల్‌మాల వేస్తున్న దృశ్యం

                    పెనుకొండ :అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. మంత్రి ఉషశ్రీచరణ్‌ పెనుకొండ సమన్వయకర్తగా మొట్టమొదటిసారి పట్టణానికి రావడంతో శనివారం నియోజకవర్గంలోని వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్‌ ఆదేశాల మేరకు పెనుకొండకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చానని, పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. మా జెండా.. అజెండా జగనే అన్నారు. ఆయన ఆదేశాలను శిరసా వహిస్తామన్నారు. అంతకుముందు మంత్రికి అమ్మవారిపల్లిలో ఎమ్మెల్సీ మంగమ్మ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పొగాకు రామచంద్ర, హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వారుతో మంత్రి పెద్ద చెరువు కట్ట ఆంజనేయ స్వామి ఆలయం వెళ్లారు. అక్కడ మంత్రికి నియోజకవర్గ పరిశీలకులు బాబు రెడ్డి, ఎజిపి భాస్కర్‌రెడ్డి, వైసిపి నాయకులు సుధాకర్‌రెడ్డి, గంపల రమణారెడ్డి, వైశాలి జయారెడ్డి,గీతా రామ్మోహన్‌రెడ్డి, సూర్య ప్రకాష్‌ రెడ్డి, పద్మావతి అక్కులప్ప, నారాయణరెడ్డి, బాలాజీ, నల్లపరెడ్డి కృష్ణారెడ్డి, తదితరులు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వారుతో పట్టణంలోకి చేరుకున్నారు. మార్కెట్‌ యార్డ్‌ వద్ద బాణసంచా పేల్చి మంత్రికి స్వాగతం పలికారు. దర్గా సర్కిల్‌లో క్రేన్‌ సాయంతో యాపిల్‌ గజమాల వేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ బాబయ్యస్వామి దర్గా వద్దకు చేరున్నారు. మహల్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భర్త చరణ్‌తో కలిసి చాదర్‌ను సమర్పించారు. గోరంట్ల రూరల్‌ : పెనుకొండ నూతన సమన్వయకర్త, మంత్రి ఉషశ్రీచరణ్‌కు గోరంట్ల ఉప సర్పంచి రాజారెడ్డి వైసిపి శ్రేణులతో 50 వాహనాల్లో తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిపల్లి వద్ద జై జగన్‌, జై ఉషమ్మ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గంపల రమణారెడ్డి, కంగారెడ్డిపల్లి గోవిందరెడ్డి, కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాగరాజు, జయచంద్రారెడ్డి, నరేంద్రరెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.

➡️