అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

Mar 10,2024 21:43

సిఐటియు రమేష్‌కు నోటీసు అందజేస్తున్న పోలీసులు

పెనుకొండ : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్‌ హెచ్చరించారు. ఈ సందర్బంగా అయన పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తనకల్లు మండలం సిపిఎం అనుబంధ సంఘాలు సిఐటియు,ఏపీ రైతు సంఘం మద్దతుగా రైలురోకో కార్యక్రమానికి బయలుదేరుతుండగా స్థానిక పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించడం అన్యాయమన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, వివిధ డిమాండ్లతో పార్లమెంటుకు వెళ్లి వినతి పత్రం సమర్పించుటకు బయలుదేరిన రైతు సంఘాలను ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం పోలీస్‌ బలగాలను మొహరింప చేసి ఉద్యమాలను అణిచివేసిందని విమర్శించారు.

మడకశిర : రైలురోకోకు వెళుతున్న మడకశిర ప్రాంత రైతులను ఇంటలిజెన్స్‌ విభాగం వారు బెదిరించడం తగదని ఈ ప్రాంత రైతులు అన్నారు. పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లో రైలురోకో నిర్వహించడానికి వెళుతున్న రైతులను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆనంద రంగారెడ్డి, సోము కుమార్‌, వేమారెడ్డి, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సమస్యలపై పోరాటాలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం అమానుషమన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.

తనకల్లు : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిపిఎం, రైతుసంఘాల నాయకులు హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రైలురోకో కార్యక్రమానికి వెళుతున్న తనకల్లు మండలం నుంచి సిపిఎం, సిఐటియు, రైతుసంఘం నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అపలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శివన్న, రైతు సంఘం వివి రమణ, రమణ, సిఐటియు ఒంటెద్దు వేమన్న తదితరులు పాల్గొన్నారు.

➡️