అదనపు తరగతి గదులు ప్రారంభం

Mar 13,2024 22:15

నూతన భవనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

                      నల్లచెరువు : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో నాబార్డ్‌ నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులనుకదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పివి. సిద్దారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ఉపయోగకరమైన అవసరమైన అదనపు తరగతి గదులను త్వరితగతిన నిర్మించి, వారికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తలుపుల : తలుపుల-3 గ్రామ సచివాలయం పరిధిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్ర భవనాలను కదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పి వి సిద్ధారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️