అర్జీదారులకు న్యాయమైన పరిష్కారం చూపించాలి

Dec 11,2023 21:41

 వినతులు స్వీకరిస్తున్న అధికారులు

                పుట్టపర్తి అర్బన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే మండల డివిజన్‌ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అర్జీదారులకు న్యాయమైన సత్వర పరిష్కారం చూపాలని డిఆర్‌ఒ కొండయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ లోని స్పందన హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ తో పాటు గ్రామ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్‌ శివారెడ్డి, డిపిఒ విజయకుమార్‌, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, సిపిఒ విజరు కుమార్‌ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ ఫిర్యాదులకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. ప్రతి అర్జీ దారుడు సంతృప్తి చెందే విధంగా గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆయన సూచించారు. స్పందన కార్యక్రమంలో 278 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కృష్ణారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌బాషా, పట్టు పరిశ్రమల శాఖ జెడి పద్మమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్‌ రషీద్‌ ఖాన్‌, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మీ కుమారి, సాంఘిక సంక్షేమ అధికారి శివ రంగ ప్రసాద్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌ రావు, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️