ఇఫ్తార్‌లో పాల్గొనే అర్హత చంద్రబాబుకు లేదు

Mar 28,2024 21:37

ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి మక్బూల్‌

                      కదిరి టౌన్‌ : ఏనాడు మైనారిటీలను గుర్తించని చంద్రబాబుకు ఇఫ్తార్‌లో పాల్గొనే అర్హత లేదనికదిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్‌ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం రూరల్‌ మండల పరిధిలోని పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా, వీరేపల్లి పేట, రాచవారి పల్లి తండాలలో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి పాటుపడే వైసిపిని ఆదరించాలని కోరారు. పదవుల ఆశ చూపి పార్టీలో చేర్చుకుని కదిరి మైనారిటీ నాయకుడిని నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్‌ రెడ్డి, జడ్పిటిసి భూక్యా రాధాకృష్ణ నాయక్‌, మండల కన్వీనర్‌ ప్రకాష్‌, సర్పంచి చలపతి నాయక్‌, ఎంపీటీసీ ఆనంద్‌ నాయక్‌, జిల్లా అగ్రికల్చర్‌ బోర్డు మెంబర్‌ సుధీర్‌ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️