ఎపిని అప్పుల పాల్జేసిన సిఎం జగన్‌ : బికె

Dec 25,2023 21:42

 గోరంట్లలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారధి

                     గోరంట్ల :సిఎం జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారథి విమ ర్శించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని మూలబావి వీధిలో ఇంటింటికీ వెళ్లి టిడిపి రూపొందించిన సూపర్‌ సిక్స్‌, మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్‌ సర్కిల్‌లో బికె మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి టిడిపితోనే సాధ్యమన్నారు. వైసిపి పాలన దౌర్జన్యాలు, అరాచకాలతో సాగిం ది తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, హిందూ పురం పార్లమెంట్‌ కార్యదర్శి నరసింహులు, మారేడుపల్లి నరసింహులు, వెంకటరమణ, జయరాం, శ్రీనివాసులు, వేణు, ఉమర్‌ఖాన్‌, అజ్మతుల్లా, దాసయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. మడకశిర : చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. మండల పరిధిలోని ఆమిదాలగొంది పంచాయతీ హెచ్‌ఆర్‌.పాల్యం, గౌరీపురం గ్రామాల్లో బాబు ష్యూరిటీి-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో తెలుగుతమ్ముళ్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మినారాయణ, నాయకులు నాగరాజు, గిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️