ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Jan 3,2024 22:30

వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

                       పుట్టపర్తి రూరల్‌: సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో భాగ్యరేఖకు అందజేశారు. 15వ రోజు సమ్మెలో భాగంగా సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి, రామన్న, , నాగరాజు, ఓబులేసు, రూపాదేవి, శ్రీలత, హేమావతి, అనిత, శ్రీనివాసులు, ఆనంద్‌, ప్రసాద్‌ రాజశేఖర్‌, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బుక్కపట్నం : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని ఎస్‌ఎస్‌ఎ జెఎసి జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తమ ప్రధాన డిమాండ్ల సాధనకు ధర్నా నిర్వహిస్తున్నామని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. డిమాండ్లు పరిష్కారం కోసం రాష్ట్ర సమగ్ర శిక్ష కాంట్రాక్టర్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జేఏసీ పిలుపు మేరకు సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామన్న, సిబ్బంది పాల్గొన్నారు.

➡️