కదిరిగేట్‌ రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి బాధితుల నిరసన

కదిరిగేట్‌ రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి బాధితుల నిరసన

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు,బాధితులు

 

        ధర్మవరం టౌన్‌ :స్థానిక కదిరిగేట్‌ రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు వల్ల నష్టపోతున్న తమకు ప్రస్తుతం ఉన్న స్థల విలువ ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు టిడిపి నాయకులతో కలిసి శుక్రవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయం జరిగే వరకూ ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. రీసర్వే చేయించి తగిన నష్టపరిహారం చెల్లించాలని, లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ రమేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఫణికుమార్‌, పరిశే సుధాకర్‌, పురుషోత్తంగౌడ్‌, నాగూర్‌హుస్సేన్‌, రాళ్లపల్లి షరీఫ్‌, కేశగాళ్ల శీన, గోసల శ్రీరాములు, పఠాన్‌ఖాన్‌, అత్తర రహీంబాషా తదితరులు పాల్గొన్నారు.

➡️