కదిరి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం

Mar 13,2024 22:16

పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే, తదితరులు

                        కదిరి టౌన్‌ : అందరి సమిష్టి సహకారంతో ఖాద్రీ లక్ష్మినరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దామని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్నాన్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆలయంలో డిప్యూటీ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు జరుగుతాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. గత ఏడాది ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పార్కింగ్‌, భగుతీర్థం, దైవదర్శనం, తాగునీరు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు సహకరించకపోవడం వల్ల భగుతీర్థంను అందుబాటులోకి తీసుకురాలేకపోయామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి, వివిధ శాఖల అధికారులు, పలు పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

➡️