కరాటే బెల్ట్‌ టెస్ట్‌లో కదిరి విద్యార్థుల ప్రతిభ

Dec 31,2023 21:58

 ప్రతిభా విద్యార్థులతో మాస్టర్‌, తదితరులు

                       కదిరి టౌన్‌ : పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో యునైటెడ్‌ షోటోఖాన్‌ కరాటే డో ఇండియా, శ్రీ సత్యసాయి జిల్లా స్టయిల్‌ ఛీఫ్‌, కరాటే మాస్టర్‌ 5 థ్‌ డాన్‌ బ్లాక్‌ బెల్ట్‌ మాస్టర్‌ షాకీర్‌ ఆధ్వర్యంలో బెల్ట్‌టెస్ట్‌లు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అఫీషియల్‌ ఎక్సమినర్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ కరాటే కోచ్‌ వి.మురళీకృష్ణ రెడ్డి హాజరై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కరాటే నేర్చుకోవటం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మ విశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కలర్‌ బెల్ట్స్‌, సీనియర్‌ బ్రౌన్‌ బెల్ట్‌ పరీక్షలో మొత్తం 21 విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. అయేష, సఫాన్‌, ధీరజ్‌ రెడ్డి, ఫైజాన్‌ ఎల్లో బెల్ట్‌ను కైవసం చేసుకున్నారు. హారిక, భవిత్‌ రాయల్‌, జోషిత ఆరంజ్‌ బెల్ట్‌, జశ్విత, మహమ్మద్‌ ఫహీం, గీతా బ్లూ బెల్ట్‌ను సాధించారు. రబ్బన్‌, రిహన్‌, కృష్ణ కీర్తి పర్పుల్‌ బెల్ట్‌ దక్కించున్నారు. సీనియర్‌ బ్రౌన్‌ బెల్ట్‌ పరీక్షల్లో వైష్ణవి, సుహాన, హర్షవర్ధన్‌, మహమ్మద్‌ కైఫ్‌ బ్రౌన్‌ బెల్డ్‌ ఫోర్త్‌ డాన్‌ను, హిమవంత్‌ సాయి 3 థర్డ్‌ డాన్‌ను, లవన్‌ కుమార్‌,దైవీక్‌, యజ్ఞేష్‌ సెకెండ్‌ డాన్‌ను సాధించినారు. ప్రతిభా విద్యార్థులకు మురళీకృష్ణ రెడ్డి చేతుల మీదుగా బెల్ట్‌లను, ప్రశంసాపత్రాలను అందజేశారు. మాస్టర్‌ షాకిర్‌ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే అలైహి వసల్లం, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️