కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Feb 28,2024 22:32

సమావేశంలో మాట్లాడుతున్న సామకోటి

                         పుట్టపర్తి క్రైమ్‌ :వచ్చే ఎన్నికల్లో కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కురుబసంఘం నాయకులు కోరారు. బుధవారం పుట్టపర్తి సాయి సదన్‌ అతిథిగృహంలో కురుబ నాయకులు సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారు. ఉమ్మడి జిల్లాలో అధిక సంఖ్యలో కురుబలు ఉన్నారని కురుబల మనోభావాలను గమనించి రానున్న ఎన్నికలలో టిడిపి తో పాటు ఇతర పార్టీలు కూడా కురుబలను గుర్తించి తగిన సముచిత స్థానం రాజకీయంగా కల్పించాలని కోరారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు లక్షల మంది కురుబలు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేల సీట్లను కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ, కేసాని ఆదినారాయణ, నాయకులు బన్యాల రమేష్‌, క్రిష్టప్ప, నాగరాజు, బాలు, ప్రసాద్‌, ఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు.

➡️