గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య

Dec 18,2023 21:57

 నృత్యం చేస్తున్న విద్యార్థులు

                    హిందూపురం : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఎల్‌ఆర్‌జి విద్యాసంస్థలను స్థాపించినట్లు ఆ విద్యాసంస్థల అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త సుమంత్‌ మూర్తి అన్నారు. హిందూపురం రూరల్‌ మండలం కిరికెర వద్ద ఉన్న ఎల్‌ఆర్‌జి విద్యా సంస్థల్లో సోమవారం ఫౌండర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహంచారు. ఈ సందర్బంగా ఎల్‌ఆర్‌జి పబ్లిక్‌ స్కూల్‌, ఎల్‌ఆర్‌జి విద్యాలయ, ఎల్‌ఆర్‌జి నాయుడు జూనియర్‌ కళాశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో విద్యాసంస్థల అధ్యక్షులు సుమంత్‌ మూర్తి, డైరెక్టర్‌ నిఖిల్‌ గోవింద్‌ రామమూర్తి, సెక్రటరీ బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్‌ స్కూల్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం భారతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుమంత్‌ మూర్తి, డైరెక్టర్‌ నిఖిల్‌ గోవింద్‌ రామమూర్తి, డిఎల్‌డిఒ డాక్టర్‌ శ్రీలక్ష్మి మాట్లాడుతు నైతిక విలువలతో కూడిన విద్య విద్యార్థుల భవిష్యత్తును బంగారు మయం చేస్తుందన్నారు. ప్రతి విద్యార్ధి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాల పేరు తీసుకురావాలన్నారు. ఈ విద్యాసంస్థల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. పాఠశాల సెక్రటరీ బాలసుందరం మాట్లాడుతు పాఠశాలలో ఎక్కడాలేని విధంగా విద్యార్థుల కోసం యోగా, వ్యాయామ, గేమ్స్‌, స్పోర్ట్స్‌తో పాటు ఎన్‌సిసి ఏర్పాటు చేసి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం ప్రతిభా విద్యార్తులకు సర్టిఫికెట్లతో పాటు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను, వివిధ క్రీడల్లో రాణించిన వారికి మెమోంటో, సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎఒ సంజీవరెడ్డి, ఎహెచ్‌ఎం సుధ, ఉపాధ్యాయులు విజరు, హరినాథ్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అథితులతో పాటు ముఖ్యవక్తగా దీప్తి పాఠశాల వ్యవస్థపాక అద్యక్షులు అబ్రహం కుట్టి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటరామిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️